Aug 12,2023 21:14

న్యూఢిల్లీ : దిగ్గజ వాహన కంపెనీ టాటా మోటార్స్‌ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ కార్లపై భారీగా డిస్కౌంట్‌లను ప్రకటించింది. టాటా టిగోర్‌ ఇవి, టాటా నెక్సాన్‌ ఇవిలపై రూ.80వేల వరకు తగ్గింపును ఇస్తోన్నట్లు తెలిపింది. టాటా టిగోర్‌పై రూ.80 వేల రాయితీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్సేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ తగ్గింపు, అదనపు వారంటీ లేదా ఉపకరణాలు ఉన్నాయి. దీని ఎక్స్‌షోరూం ధర రూ.12.49-13.75 లక్షలుగా ఉంది. నెక్సాన్‌ ఇవిలోని రెండు వేరియంట్‌లు అయినా ఫ్రైమ్‌, మ్యాక్స్‌పై వరుసగా రూ.61,000, రూ.56,000 డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఎక్స్‌షోరూం వద్ద వీటి ధర రూ.14.49 లక్షల నుంచి రూ.17.19 లక్షలుగా ఉంది.