
- క్లాసెన్ క్లాసిక్ ఇన్నింగ్స్
మహ్మదుల్లా సెంచరీ వృధా
-బంగ్లాదేశ్‌పై 149పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వాంఖడే స్టేడియంలో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 149పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 382పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో బంగ్లాజట్టు 46.4ఓవర్లలో 233పరుగులకు ఆలౌటైంది. తొలుత దక్షిణాఫ్రికా ఓపెనర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మరోసారి భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. వన్డే ప్రపంచకప్‌లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. బంగ్లాదేశ్‌పై 174 పరుగులతో చెలరేగాడు. ఇందులో 15ఫోర్లు, భారీ 7సిక్సర్లు ఉన్నాయి. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (90; 49బంతుల్లో 2ఫోర్లు, 8సిక్సర్లు క్లాసిక్ ఇన్నింగ్స్, చివర్లో డేవిడ్ మిల్లర్ (34నాటౌట్; 15బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో దక్షిణాఫ్రికాజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (12; 19 బంతుల్లో), వన్‌డౌన్‌లో వచ్చిన వాండర్ డుసెన్(1) విఫలమయ్యారు. నిలకడగా ఆడుతున్న హెండ్రిక్స్‌ను ఆరో ఓవర్‌లో షోరిఫుల్ ఇస్లామ్ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన డుస్సెన్‌ను మెహదీ హసన్ మిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం డికాక్, మార్‌క్రమ్ నిలకడగా బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డికాక్ 47 బంతుల్లో, మార్‌క్రమ్ 57 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన మార్‌క్రమ్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో డికాక్ గేర్లు మార్చి ఆడాడు. షోరిఫుల్ వేసిన 42 ఓవర్‌లో ఓ ఫోర్, సిక్స్ బాదిన అతడు.. షకీబ్ వేసిన తర్వాతి ఓవర్‌లో 6, 4, 6, 4 బాదేసి 150ల్లోకి వచ్చేశాడు. షోరిఫుల్ వేసిన మరో ఓవర్‌లో డికాక్ వరుసగా రెండు బౌండరీలు రాబట్టగా.. క్లాసెన్ సిక్స్ కొట్టాడు. డబుల్ సెంచరీపై కన్నేసిన డికాక్‌ను హసన్ మమమూద్ ఔట్ చేశాడు. డికాక్ ఔటైన తర్వాత క్లాసెన్ మరింత ధాటిగా ఆడాడు. మహమూద్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన క్లాసెన్.. ముస్తాఫిజుర్ వేసిన 47 ఓవర్‌లో వరుసగా 6,4,6 దంచాడు. మిల్లర్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షోరిఫుల్ వేసిన 49 ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. మహమూద్ వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ బాదిన క్లాసెన్ తర్వాతి బంతికే మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో డికాక్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సఅష్టించారు. చివరి 13 ఓవర్లలో సౌతాఫ్రికా ఏకంగా 174 పరుగులు రాబట్టింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్‌కు రెండు, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
ఛేదనలో భాగంగా బంగ్లాదేశ్ 158పరుగులకే 8వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మిడిలార్డర్ బ్యాటర్ మహ్మదుల్లా(111; 111బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. లింటన్ దాస్(22) ఫర్వాలేనిపించినా.. కెప్టెన్ షకీబ్(1), ముష్ఫికర్(9), నజ్ము(0) నిరాశపరచడంతో జట్టు ఫలితంపై ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కోర్ట్జేకు మూడు, జెన్సన్, విలియమ్స్, రబడాకు రెండేసి, మహరాజ్‌కు ఒక వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డి కాక్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి)నసుమ్ అహ్మద్ (బి)హసన్ మహ్మద్ 174, హెండ్రిక్స్ (బి)షోరిఫుల్ ఇస్లామ్ 12, డుస్సెన్ (ఎల్‌బి)మెహిదీ హసన్ మిరాజ్ 1, మార్‌క్రమ్ (సి)లింటన్ దాస్ (బి)షకీబ్ 60, క్లాసెన్ (సి)మహ్మదుల్లా (బి)హసన్ మహ్మద్ 90, డేవిడ్ మిల్లర్ (నాటౌట్) 34, జెన్సన్ (నాటౌట్) 1, అదనం 10. (50ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 382పరుగులు.
వికెట్ల పతనం: 1/33, 2/36, 3/167, 4/309, 5/374
బౌలింగ్: ముస్తాఫిజుర్ 9-0-76-0, మెహిదీ హసన్ మిరాజ్ 9-0-44-1, షోరిఫుల్ ఇస్లామ్ 9-0-76-1, షకీబ్ 9-0-69-1, హసన్ మహ్మద్ 6-0-67-2, నసుమ్ అహ్మద్ 5-0-27-0, మహ్మదుల్లా 3-0-20-0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ హసన్ (సి)క్లాసెన్ (బి)జాన్సెన్ 12, లింటన్ దాస్ (ఎల్‌బి)రబడా 22, నజ్ముల్ హొసైన్ (సి)క్లాసెన్ (బి)జాన్సెన్ 0, షకీబ్-అల్-హసన్ (సి)క్లాసెన్ (బి)విలియమ్స్ 1, ముష్ఫికర్ రహీమ్ (సి)ఫెల్హ్యులియో (బి)కొర్ట్జే 8, మహ్మదుల్లా (సి)జెన్సన్ (బి)కొర్ట్జే 114, మెహిదీ హసన్ (సి)ఫెల్హ్యులియో (బి)మహరాజ్ 11, నసుమ్ అహ్మద్ (సి అండ్ బి)కొర్ట్జే 19, హసన్ మహ్మద్ (సి)కొర్ట్జే (బి)రబడా 15, ముస్తఫిజుర్ (సి)మిల్లర్ (బి)విలియమ్స్ 11, షోరిఫుల్ ఇస్లామ్ (నాటౌట్) 6, అదనం 17. (46.4ఓవర్లలో) 233 పరుగులకు ఆలౌట్.
వికెట్ల పతనం: 1/30, 2/30, 3/31, 4/42, 5/58, 6/81, 7/122, 8/159, 9/227, 10/233
బౌలింగ్: జెన్సన్ 8-0-39-2, విలియమ్స్ 8.4-1-56-2, కొర్ట్జే 10-0-62-3, రబడా 10-1-42-2, మహరాజ్ 10-0-32-1