హైదరాబాద్ : క్లియర్ ప్రీమియం వాటర్ తన బ్రాండ్ అంబాసీడర్‌గా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను నియమించుకున్నట్లు ప్రకటించింది. దేశ్‌కి క్లియర్ అనే నినాదంతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఈ బ్రాండ్‌ను తీసుకువస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకర సిఇఒ నయన్ షా పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన నీటిని చేరవేయాలనే మా ప్రయాణంలో హతిక్ రోషన్ బాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఉన్న అభిమానులు అభిమానించే వారు తమ నీటిని కూడా అభిమానిస్తారని భావిస్తున్నామన్నారు.










