Sep 22,2023 21:56

ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం) :విశాఖలోని ముడసర్లోవ వద్దగల ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరుగుతున్న పిజిటిఐ ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో హోరాహోరీ పోరు సాగుతోంది. శుక్రవారం జరిగిన పోటీల్లో 53 మంది పాల్గన్నారు. నాలుగో రౌండ్‌ లీడర్‌ బోర్డులో మొదటి పది మందిలో సున్హిత్‌ బిహనోరు (-9), అక్షయ్ శర్మ (-8), శివేంద్ర సింగ్‌ (-6), త్రిశూల్‌ చిన్నప్ప (-5), సార్తాక్‌ చిబ్బీర్‌ (-4), మహ్మద్‌ సంజు (-3), ఒఎం ప్రకాష్‌ చౌహాన్‌ (-3), హరేంద్ర గుప్తా (-3), సామ్రాట్‌ ద్వివేది (-2), రోహన్‌ ధోలె పటేల్‌ (-2) స్కోర్లుతో ముందంజలో ఉన్నారు. విజేతలకు శనివారం మధ్యాహ్నం బహుమతి ప్రదానం చేస్తామని ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కార్యదర్శి ఎంఎస్‌ఎన్‌.రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, తూర్పు నౌకాదళం చీఫ్‌ కమాండర్‌ రాజేష్‌ పెండత్కర్‌ హాజరవుతారని క్లబ్‌ ఉపాధ్యక్షులు వినోద్‌ బాబు తెలిపారు.