- ఫైనల్లో పాకిస్తాన్‌పై షూటౌట్‌లో గెలుపు
హాకీ-5 ఆసియాకప్ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 3-2గోల్స్ తేడాతో పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 4-4గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో సీజన్-1 టైటిల్‌ను భారతజట్టు కైవసం చేసుకుంది. తొలి అర్ధభాగం ముగిసే సరికి భారతజట్టు 2-3గోల్స్ తేడాతో వెనుకబడింది. ఆ తర్వాత భారత్ వరుసగా పాకిస్తాన్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. షూటౌట్‌లో మణిందర్ సింగ్, గుర్‌జ్యోత్ సింగ్ గోల్స్ చేయగా.. భారత గోల్‌కీపర్ సురజ్ కర్కేటా పాకిస్తాన్ ఆటగాళ్లు ఆర్షాద్, మహ్మద్ కొట్టిన బంతులను ఇక భారత హాకీ జట్టు సెమీస్‌లో మలేషియాను ఓడించి 2024 ఎఫ్‌ఐహెచ్ హాకీ-5 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.