Oct 07,2023 14:20

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పోటీల్లో ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జోడి సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీరెడ్డి- చిరాగ్‌ శెట్టి... స్వర్ణం గెలిచారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్‌లో కొరియాకి చెందిన చో సోల్గూ, కిమ్‌ వోంగూతో జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కి దక్కిన మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ ఇదే.