Mar 25,2023 21:23

హైదరాబాద్‌ : ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హై రైజ్‌ కన్‌స్ట్రక్షన్‌ కొత్తగా 'ఫారెస్ట్‌ ఎడ్జ్‌' ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌ సాగర్‌ రోడ్‌ సమీపంలోని బిఎన్‌ రెడ్డి నగర్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. శనివారం ఈ ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. చుట్టూ 600 ఎకరాల విశాలమైన అటవీ ప్రాంతం సమీపంలో, అహ్లాదకర వాతావరణంలో ఈ ప్రీమియం ప్రాజెక్ట్‌ను చేపడుతున్నామని ఆసంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ఎ నర్సింహా రెడ్డి తెలిపారు. 4.78 ఎకరాల విస్తీర్ణంలో 405 అపార్ట్‌ మెంట్లలో 2,3,4 బిహెచ్‌కె ప్రీమియం ప్లాట్టు కడుతున్నామన్నారు. అనేక సదుపాయాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు.