ప్రజాశక్తి - బి.కొత్తకోట (రాయచోటి) : మదనపల్లి, ఒంగోలు, సింగరాయకొండ కోర్టుల పరిశీలనల్లో భాగంగా హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మన్మధరావు ఆదివారం బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్‌కు విచ్చేశారు. అల్పాహారం తర్వాత కొండపై విస్తృతంగా పర్యటించి, ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన గవర్నర్ బంగ్లా వి పాయింట్ గాలిబండ ఫారెస్ట్ బంగ్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ... భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన హార్సీలీహిల్స్ ప్రకృతి రమణీయంగా ఉందని, ఇక్కడ అందాలు తనని మంత్రముగ్దుడిని చేశాయని కితాబునిచ్చారు. అనంతరం ఆయన హార్సీలీహిల్స్ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. పోలీసు, కోర్టు సిబ్బంది జడ్జి వెంట ఉన్నారు.