Aug 05,2023 09:50

బాలలం మేం బాలలం
వడి వడిగా బడికి వెళతాం
బుద్ధిగా చదువుకుంటాం!

మా వూరి బడికే పోతాం !
ఆడుతూ పాడుతూ ....
చక్కగా చదువుకుంటాం!

అమ్మ భాషలోనే
అక్షరాలను దిద్దుకుంటాం!
నాన్న గారిలాగా
ఉన్నతంగా ఎదుగుతాం!

తరగతి పాఠాలను చదివి
సులువుగా అర్థం చేసుకుంటాం!
మా సంతకాలను మాత్రం
అచ్చ తెలుగులోనే చేస్తాం!

పెద్ద చదువులను దీక్షతో చదువుతాం
ఉన్నత ఉద్యోగాలను తప్పక సాధిస్తాం
మా వూరి అభివృద్ధికి సహకరిస్తాం!

బాలలం మేం బాలలం
భావి భారత నిర్మాతలం!
తెలుగు జాతికి వారసులం!

- జి.సూర్యనారాయణ
6281725659.