
అమరావతి: అగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో బుధవారానికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 16వ తేదీ నాటికి తీవ్రవాయుగుండంగా మారి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని పేర్కొంది. తదుపరి దిశమార్చుకుని 17న ఒడిశా తీరంవైపు తీవ్రవాయుగుండం కదిలే సూచనలు ఉన్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.