Jul 04,2023 16:19

హైదరాబాద్‌: జూన్‌ నెలలో మూడు వారాల తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వానలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ఈ నెలలో సాధారణంకంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ఆగేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ వాఖ సూచించింది. ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.సాధారణ వర్షపాతం కంటే 46శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 7 జిల్లాల్లో మాత్రమే సాధా రణ వర్షపాతం నమోదైంది.సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, నారాయణపేట్‌ జిల్లాల్లో జూన్‌ నెల సా ధారణ వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో 8 జిల్లాల్లో అత్యంత లోటు వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూలైలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.