
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఎండలు దంచి కొట్టనున్నాయి. రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రాగల మూడు రోజులపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆ మూడు రోజులపాటు అత్యవసరమైతే తప్ప పగటిపూట జనం ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరించింది.