Jul 23,2023 10:56

అమరావతి : ఎపిలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో... మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. రెయిన్‌ అలర్ట్‌ జారీ చేస్తూ వెదర్‌ రిపోర్ట్‌ ను విడుదల చేశారు.

                                                             పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు...

ఆదివారం కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కఅష్ణ, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురవనుండగా.. ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

                                                                   పలు జిల్లాల్లో స్వల్ప వర్షాలు...

అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్‌, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, నంద్యాల, బాపట్ల, పల్నాడు, కృష్ణ, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఉభయగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అదే విధంగా 25 న ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్‌, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేశారు. అదే రోజు పల్నాడు, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, కోనసీమ, తిరుపతి, బాపట్ల, చిత్తూరు, కాకినాడ, అన్నమయ్య, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో స్వల్ప వర్షాలు పడనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది..