హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. ఇప్పటివరకు 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన వర్షపాతమే (51 సెం.మీ.) అత్యధికంగా ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ., 200 కేంద్రాల్లో 10 సెం.మీ.పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.










