
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో శనివారం ఉరుములు, పిడుగులతో కూడిన కుంభ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. టిటిడి కల్యాణ మండపం రోడ్డు, మసీదు రోడ్డు, శేశామహల్ రోడ్డు, తలుకాఫీస్ ప్రాంగణం, కడకట్ల, యగర్లపల్లి, ఆర్‌టిసి బస్ స్టాండ్ ప్రాంగణం, వికర్స్ కాలని నీట మునిగాయి. దీనికి తోడు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలలోని నీరు రోడ్లపైకి చేరదాంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు.