Sep 02,2023 17:02

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. రూ. 50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌, ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. హ్యాండ్‌ బ్యాగ్‌లో బ్రౌన్‌ టేపు వేసి డ్రగ్స్‌ తరలిస్తుండగా, గుర్తించి సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ డ్రగ్స్‌ తరలిస్తున్న వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసి, శంషాబాద్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.