Jun 05,2023 11:18

ఈ కాలంలో దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఎంతో తియ్యగా ఉండే సపోటాల్లో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వైద్యులు అంటున్నారు. నీరు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ చెమట పట్టేవారు వీటిని తీసుకుంటే నీరసం తగ్గి శక్తి పొందుతారు. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

  • ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ కూడా సపోటాలో పుష్కలంగా ఉన్నాయి. దాంతో రక్తహీనత తగ్గుతుంది.
  • సపోటాల్లో ఉన్న ఫోలేట్స్‌, కాల్షి.యం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, కాపర్‌, ఫాస్పరస్‌, సెలెనియంలు ఎముకలను ధృఢంగా చేస్తాయి.
  • వీటిలో ఉండే విటమిన్‌ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. విటమిన్‌ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుంది. కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది.
  • సపోటాలో డైటరీ ఫైబర్‌ ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుది. వీటిలో సుక్రోజ్‌ ఎక్కువ. బరువు తాగ్గాలనుకునే వారు వీటిని తీసుకుంటే మంచిది. వీటిని తిన్న వెంటనే శరీరానికి అధికశక్తి అందుతుంది. అధిక వేడి వల్ల అలిసిపోయిన వారు సపోటా జ్యూస్‌ తాగితే వెంటనే శక్తి వస్తుంది.
  • శరీరంలో వేడిని బయటకు పంపి, శరీర భాగాలను చల్ల బరిచే టానిన్స్‌ ఇందులో ఉన్నాయి. శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపుతుంది.
  • సపోటాల్లోని మెగ్నీషియం రక్త నాళాల్ని చురుగ్గా చేస్తుంది. అలాగే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తం సరిగా లేని వాళ్లు సపోటాలు తినాలి. మధుమేహం ఉన్నవారు వైద్యులను సంప్రదించి తీసుకోవాలి.