Jun 16,2023 07:47

వేసవిలో నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. రసం పిండేసి ఆ తొక్కలను పారేస్తాం. అయితే నిమ్మ తొక్కల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని పారేయరు. అవేంటో చూద్దాం.

  • నిమ్మ తొక్కల్లో విటమిన్‌ సి ఉంటుంది.
  • నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్‌ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.
  • నిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్‌ భాగాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • ఇందులో ఉన్న ఫైబర్‌ కంటెంట్‌ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది, గట్‌ ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
  • బరువును తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది..
  • గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
  • నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టి వాటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎండిన నిమ్మ తొక్కలతో టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
  • నాన్‌వెజ్‌ వంటల్లో నిమ్మరసం వాడుతుంటాం. దానికి బదులుగా నిమ్మ తొక్కల పొడిని ఉపయోగించవచ్చు. నిమ్మ తొక్కలు నానబెట్టిన నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై వచ్చే ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.