
అల్లం ఆరోగ్య దోహదకారి. జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఉదయాన్ని టీలో కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. పచ్చిది నమిలి తిన్నా, తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే !
రోగ నిరోధకశక్తి : వర్షాకాలం సీజన్‌లో వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజూ అల్లాన్ని ఏదొక రూపంలో తీసుకుంటే అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
బరువు నియంణ్రత : మారుతున్న జీవనశైలితో బయట దొరికే ఫుడ్‌ను తీసుకుంటుండటంతో చాలామంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. అల్లం ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో బర్న్ చేసే కేలరీల సంఖ్యను మెరుగుపర్చటానికి సహాయపడుతుంది.
మధుమేహ నివారిణి : మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల ఓ సర్వే పేర్కొంది. మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది.
నొప్పికి మందు : వ్యాయామం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది.
జలుబు, దగ్గుకు ఉపశమనం: ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడతాయి.
అజీర్ణ సమస్యలకు చెక్ : కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి అల్లం చాలా మంచిది. కడుపులో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది.