బెంగళూరు : దిగ్గజ ఐటి కంపెనీ విప్రో తమ ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. క్రమంగా ఇంటి నుంచి పని పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది. ఇకపై ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే 55 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడుసార్లు ఆఫీసులకు వస్తున్నారని వెల్లడించింది. టిసిఎస్ ఇన్ఫోసిస్ దిగ్గజాలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే.