ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు) : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్‌పి డి.మేరీ ప్రశాంతి హెచ్చరించారు. మంగళవారం ఏజెన్సీలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిశీలనలో భాగంగా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పలు కేసుల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు.అదే విధంగా సరిహద్దు ప్రాంతం కావడంతో జాతీయ రహదారి గుండా గంజాయి, మద్యం, గుట్కా, రవాణాపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం డిఎస్‌పి లతాకుమారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ చంద్ర శేఖర్, స్టేషన్ సిబ్బంది, మహిళ పోలీసులు పాల్గొన్నారు.










