ముంబయి : బ్యాంకింగ్ ఉత్పత్తులను అందించడానికి, వేగంగా రుణాలు జారీ చేయడానికి ఎక్స్‌ప్రెస్‌వే వేదికను అందుబాటులోకి తెచ్చినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. ఈ వేదికపై సులభంగా వ్యక్తిగత, వ్యాపార, వాహన, గృహ, క్రెడిట్ కార్డ్ తదితర రుణాలు పొందవచ్చని పేర్కొంది. వినూత్న పద్దతుల్లో ఖాతాదారులకు వేగవంతమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది.