- కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : ఐఆర్‌సిటిసితో కలిసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ క్రెడిట్ కార్డు ఎన్‌పిసిఐ రూపే నెట్‌వర్క్ ఆధారంగా పని చేస్తుందని పేర్కొంది. దీంతో రైల్వే టికెట్ల బుకింగ్‌పై డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు ఇతర ఆఫర్లు పొందవచ్చని తెలిపింది. ఈ కార్డ్ కోసం ఇరు సంస్థల్లోని ఏ వెబ్‌సైట్‌ను అయినా సందర్శించి కార్డ్‌ను పొందవచ్చని వెల్లడించింది. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ మెరుగైన ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యుత్తమ ప్రయోజనాలతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక లాంజ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుందని ఐఆర్‌సిటిసి సిఎండి రజనీ సహిజ తెలిపారు.










