న్యూఢిల్లీ : దిగ్గజ ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నిశబ్దంగా వడ్డీ రేట్లను పెంచి.. రుణగ్రహీతలపై భారం మోపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి ఎంపిసి భేటీలో రెపోరేటును యధాతథంగా ప్రకటించినప్పటికీ.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రుణాలపై బేస్ రేటును పెంచడం గమనార్హం. అక్టోబర్ 7నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసిఎల్‌ఆర్)ను పది బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచేసింది. దీంతో గృహ, రిటైల్, వ్యక్తిగత, వాహన రుణాల ఇఎంఐలు భారం కానున్నాయి. ఈ క్రమంలో ఆ బ్యాంక్ జారీ చేసిన వివిధ రుణాలపై వడ్డీ రేట్లు 8.55 ఉంచి 9.25 మధ్య పెరుగుతాయి. ఇంతక్రితం జూన్ 16న బేస్ రేట్‌ను గరిష్టంగా 9.20 శాతానికి చేర్చింది.