న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.16,811 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. 2022-23 ఇదే సమయంలో రూ.11,162 కోట్ల లాభాలను నమోదు చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో విలీనమైన తర్వాత విడుదల తొలి ఆర్థిక ఫలితాలు ఇవే. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ.78,406 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసికంలో రూ.46,181 కోట్ల ఆదాయం చోటు చేసుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.23 శాతం నుంచి 1.34 శాతానికి పెరిగాయి.