
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం ఉగ్గినిపాలెం గ్రామంలో గడపగడపకి కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మంగళవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... రాష్ట్ర అభివఅద్ధి కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు డాక్టర్ సత్యవతి, మండల పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మి, గున్నయ్య నాయుడు, జెడ్పీటిసి దంతులూరి శ్రీధర్ రాజు, మండల ఉపాధ్యక్షులు నమ్మి వీణా, మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, సర్పంచ్ లు ఎమ్ పి టి సి పాల్గొన్నారు