Feb 20,2023 08:31

జీవితాన్ని ధార బోశాడు
కవిత్వాన్ని శ్వాసించాడు
సాహితీ లోకాన్ని శాసించాడు
వేల గ్రంథాల్ని రచించాడు
అయితేనేం,
కాలం ఆ కష్టాన్ని కొట్టిపడేసింది
చిత్తు కాగితాలంటూ తీసి పడేసింది
ఆ రాతలకు చరిత్ర ఓ చెత్త బుట్ట.
ఓ సామాన్యుడు
ఒక్క వాక్యమే రాశాడు
మనిషి ఎదగడానికి నిచ్చెనగా
మనసులు కలవడానికి వంతెనగా
కేవలం ఒక్క వాక్యమే!
అయితేనేం,
కాలం పల్లకీ పట్టింది
కలకాలం ఊరేగిస్తానంది
ఆ వాక్యానికి చరిత్ర ఓ వెండి రథం
అందుకనే,
రాసింది ఏక వాక్యమైనా
మట్టిలా పరిమళించాలి
లేదూ,మనిషిగా వికసించాలి !

- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931