
- కేంద్ర మంత్రి ఇందిర్ జిత్ సింగ్‌కు ఎంపి సత్యవతి వినతి
ప్రజాశక్తి - కశింకోట(అనకాపల్లి) : జిల్లాలోని కశింకోట గ్రామంలో పెదగుమ్మం వంతెన బాట నిర్మాణం పూర్తికి ఎంపీ నిధులు వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలని చేయాలని స్టాటిస్టిక్స్ అండ్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వర్యులు ఇందర్ జీత్ సింగ్‌కి అనకాపల్లి ఎంపి డాక్టర్ బి.సత్యవతి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా, కశింకోట గ్రామంలో వంతెన బాట నిర్మాణానికి సుమారు 2.85 లక్షలుఅవసరం అవుతాయని.. ఎంపీ నిధులు నుండి వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ఇందిర్ జిత్ సింగ్‌ను కోరారు. కసింకోట గ్రామస్థులు నిత్యం అవసరమైన వ్యవసాయ కార్యకలాపాలు, పశువుల పెంపకం, సాగు కోసం శారదా నదిని దాటడంపై ఎక్కువగా ఆధారపడతారని తెలిపారు. వర్షాకాలంలో ఈ నది దాటడం చాలా ప్రమాదకరమని తెలిపారు. నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.