ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులను కేడర్ స్ట్రెంగ్త్‌లో చూపాలంటూ పంచాయతీ కార్యదర్శుల పోరాటం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. పంచాయతీ కార్యదర్శులకు ఆరు రోజులకు ఆరు అంశాలకు సంబంధించిన శిక్షణ తరగతులు ప్రభుత్వం నిర్వహించనుంది. శిక్షణకు సంబంధించి ఈ నెల 2న పంచాయతీరాజ్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పేరిట విడుదలైన లేఖలో గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 వరకు రాష్ట్రంలో ఉన్న 14,989 పంచాయతీ కార్యదర్శులు కేడర్ స్ట్రెంగ్త్‌ను పూర్తిస్థాయిలో ధ్రువీకరిస్తూనే, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు 6,166 మందిని కేడర్ స్ట్రెంగ్త్‌లో చూపడం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జానీ పాషా హర్షం వ్యక్తం చేశారు.










