Oct 03,2023 16:56

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం(కోనసీమ): ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండల కేంద్రం మైన కపిలేశ్వరపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోగ్యశ్రీ, 108వంటి సేవా కార్యక్రమాలు ప్రవేశపెట్టి, పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్‌ లు, ఫ్యామిలీ వైద్యులు వంటి వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటికి సర్వే జరిపి వివిధ వ్యాధులతో ఉన్న రోగులను గుర్తించి, వారికి స్పెసలిస్ట్‌ వైద్యులు ద్వారా వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఐసీడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారి గజలక్ష్మి ఆద్వర్యంలో పౌష్ఠికాహారం కిట్లు ప్రదర్శించి, మెరుగైన ఆరోగ్యానికి పోషకాహారమే తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సాకా శ్రీనివాస్‌, ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఎంపీటీసీలు శీలం భాస్కర రావు, గొల్లపల్లి సోనియా, ఎంపిడివో ఎం రామక్రిష్ణ రెడ్డి, తహశీల్దార్‌ కె.సూర్య రావు, వైసీపీ గ్రామ అధ్యక్షుడు కట్టా మురళి కృష్ణ, ఉప సర్పంచ్‌ బొక్క రాంబాబు , వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, అంగన్వాడి, ఆశ కార్యకర్తలు, పార్టీ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.