Feb 13,2023 18:26

శాన్‌ ఫ్రాన్సిస్కో : టెక్‌ దిగ్గజం గూగుల్‌ వినియోగదారుల ఫొటోల భద్రతకు త్వరలో కొత్తఫీచర్‌ను తీసుకురానుంది. ఫొటోలు, వీడియోల బ్యాకప్‌ సపోర్టింగ్‌కి 'లాక్డ్‌ ఫోల్డర్‌' అనే కొత్త ఫీచర్‌ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ఈ అప్లికేషన్‌లోని కొత్త ఫీచర్‌ని సెట్టింగ్స్‌లో ఉన్న ఆప్షన్‌లో తాజాగా కనుగొనడం జరిగిందని ఆండ్రాయిడ్‌ సెంట్రల్‌ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్‌తో గత కొన్ని సంవత్సరాల క్రితంనాటి ఫొటోలను, వీడియోలను భద్రంగా ఉంచుకునే వీలుంది. 2021లో కెమెరా ఫొటోలు పాడైనట్లు వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో.. గూగుల్‌ ఈ ఫీచర్‌తో దాన్ని సవరించింది.