
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాప్టర్ సాంకేతిక కారణంతో సిర్పూర్ లోనే ఆగిపోయింది. కాసేపటి తరువాత హెలికాప్టర్ మళ్లీ టేకాఫ్ అయింది.దీంతో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన అసిఫాబాద్‌కి బయలుదేరారు.అయితే సాంకేతిక లోపం కారణంగా ఫైలట్ చాపర్ ను నిలిపివేశారు. మొన్న సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదం తఅటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాప్టర్ బయలుదేరారు. అయితే హెలికాప్టర్ పైకి లేచిన కొద్ది సమాయనికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సిర్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం అసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగలో ఆయన ప్రసంగించనున్నారు.