- నియోజకవర్గంలో 14,527 మంది రైతులకు ఎలుకల పంపిణీ.
ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రస్తుతం తొలకరిచేలు పొట్ట దశలో ఉండడంతో ఎలుకల బెడద అధికమైందని ప్రభుత్వం అందజేసే ఉచిత ఎలకల మందు సామూహికంగా ఒకేసారి ఉపయోగించడం వల్ల రైతులకు మంచి ఫలితం ఉంటుందని మండల వ్యవసాయ శాఖ సలహా సంఘం చైర్మన్ ఇళ్ల సూర్యనారాయణ అన్నారు. శివల రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఎలకల మందు పంపిణీ కార్యక్రమంలో ఏవో బలుసు రవితో కలిసి ఆయన ఎలకల మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయశాఖ అధికారి రవి మాట్లాడుతూ కే గంగవరం మండలం 73 కేజీలు రామచంద్రపురం మండలం 84 కేజీలు ఎలకల మందు ప్రభుత్వం అందజేసిందని మండలంలోని 14,527 మంది రైతులకు దీనిని పంపిణీ చేస్తున్నామని బ్రోమోడైలిన్ అనే ఎలకల ముందు సామూహికంగా ఉపయోగించడం వల్ల ఫలితాలు బాగుంటాయి అన్నారు. నియోజకవర్గ అంతా ఒకేసారి మందు పంపిణీ చేశామని రైతులంతా ఒకేరోజు దీన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనసూరి సాయిబాబు, వ్యవసాయ సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెం గ్రామపంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ యల్లమిల్లి సతీష్ కుమారీ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత ఎలకల మందును పంపిణీ చేశారు.










