
ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : రైతులు మేలైన వ్యవసాయ పద్ధతులు పాటించి పురుగుమందుల వాడకం తగ్గిస్తే నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేయవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి జియో వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం అప్పన్నపేటలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు సంఘటితంగా ఉంటే ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ స్కీములు కూడా వర్తిస్తాయని చెప్పారు. సహాయ సంచాలకులు పి.మురళికృష్ణ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ అధికారులు సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. మండల వ్యవసాయ అధికారి వై.ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని.. అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలన్నారు. పశు వైద్యులు జ్యోతి మాట్లాడుతూ.. రైతులు తమ పశువులకు రైతు భరోసా కేంద్రాల వద్ద ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వం నుండి వచ్చే గడ్డి విత్తనాలు పశువుల దాన భరోసా కేంద్రాల వద్ద తక్కువ దొరుకుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.