ముంబై : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా దేశంలోని ప్రముఖులకు గోల్డెన్ టికెట్‌లను అందిస్తోంది. ఇటీవల బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను కలిసి గోల్డెన్ టికెట్‌ను అందజేసిన జై షా నేడు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను కలిసి వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్‌ను అందజేశారు. ఈ గోల్డెన్ టికెట్‌తో వరల్డ్ కప్‌లోని ఏ మ్యాచ్‌ను అయినా, స్టేడియానికి వచ్చి వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించవచ్చు.










