May 27,2023 21:30

న్యూఢిల్లీ : పసిడి ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. శనివారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.160 తగ్గి రూ.60,710 వద్ద నమోదయ్యింది. గుడ్‌రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పసిడిపై రూ.150 తగ్గి రూ.55,650గా పలికింది. కిలో వెండిపై రూ.150 కోల్పోయి రూ.72,900గా చోటు చేసుకుంది.