Apr 18,2023 21:07

న్యూఢిల్లీ : దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గినప్పటికీ రూ.60వేల ఎగువనే కొనసాగుతోంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడిపై రూ.180 తగ్గి రూ.60,300గా ఉందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఇంతక్రితం సెషన్‌లో ఈ లోహం ధర రూ.60,480 వద్ద ముగిసింది. పసిడి బాటలోనే కిలో వెండిపై రూ.240 తగ్గి రూ.75,780 వద్ద నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క ఔన్స్‌ పసిడి ధర 2,003 డాలర్లుగా, వెండి ధర 25.15 డాలర్లుగా చోటు చేసుకుంది.