- కిలో వెండి రూ.78,250కి చేరిక
న్యూఢిల్లీ : దేశంలో బంగారం ధర సామాన్యుడికి అందకుండా పోతోంది. శనివారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.220 పెరిగి రూ.62,400కు చేరింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాములపై రూ.200 పెరిగి రూ.57,200గా పలికింది. హైదరాబాద్, కోల్‌కత్తా, ముంబయిలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.62,400గా నమోదయ్యింది. కిలో వెండిపై ఏకంగా రూ.1,150 ఎగిసి రూ.78,250కి చేరింది.










