న్యూఢిల్లీ : బంగారం ధర పెరుగుతూనే ఉంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.100 పెరిగి రూ.61,850కి చేరింది. గోల్డ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల ధర రూ.56,700గా నమోదయ్యింది. కిలో వెండి ధర యథాతథంగా రూ.78,100గా పలికింది. హైదరాబాద్, ముంబయి, కోల్‌కత్తాలోలోనూ 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.61,850గా నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క ఔన్స్ పసిడి ధర స్వల్ప మార్పుతో 2,023 డాలర్లుగా చోటు చేసుకుంది.










