
చెన్నై : వన్డే ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్‌లోనే భారత్ ఆస్ట్రేలియాపై అపూర్వ విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డక్‌ఔట్‌గా పేవిలియన్‌కు చేరగా.. విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్ల్‌ా క్రీజులో నిలదొక్కుకోని జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో కోహ్లీకి భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బంగారు పతకాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేసింది. ''నేటి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ సమయంలో చేసిన డైవింగ్ అద్భుతం. కానీ, మన జట్టులో ముఖ్యంగా స్థిరత్వం గురించి మాట్లాడుతుంటాం. కేవలం ఒక క్యాచ్ గురించి కాదు, మొత్తం మీద పనితీరు ఎలా ఉందన్నది ముఖ్యం. కేవలం మీ పనిని మాత్రమే చేయడం కాదు. జట్టులో ఇతర సభ్యులు మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సహించడం ముఖ్యం. అందుకే ఇది విరాట్ కోహ్లీకి ఇది దక్కుతుంది'' అని బంగారం మెడల్ అందిస్తూ దిలీప్ పేర్కొన్నారు.