న్యూఢిల్లీ : వారాంతం రోజున బంగారం ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. శనివారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.440 పెరిగి రూ.60,110గా పలికింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల పసిడిపై కూడా రూ.400 పెరిగి రూ.55,100 వద్ద నమోదయ్యింది. చెన్నయ్, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500గా ఉంది.










