ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్
బాకు(టర్కీ): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణ, మరో కాంస్య పతకం దక్కాయి. శుక్రవారం ఈషా సింగ్, శివ్ నర్వాల్‌లతో కూడిన భారత మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ ద్వయం 16-10పాయింట్ల తేడాతో టర్కీకి చెందిన ఇలైదా తర్హాన్‌ాయూసుఫ్ డికెక్‌లను చిత్తుచేసి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని ఖాయం చేశారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈషా 290, నర్వాల్ 293పాయింట్లతో మొత్తం 583పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. టర్కీ 581పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాయి. చైనా, ఇరాన్ 580పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాయి. ఇక 10మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో భారత్ 4వ స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఇక పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో శివ నర్వాల్(579), షరబ్‌జ్యోత్ సింగ్(578), అర్జున్ సింగ్(577)లతో కూడిన జట్టు మొత్తం 1734పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించారు. దీంతో భారత్ ఒక స్వర్ణ, 3కాంస్యాలతో పతకాల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో చైనా 5స్వర్ణ, 2రజత పతకాలతో అగ్రస్థానంలో ఉంది.










