న్యూఢిల్లీ: ప్రపంచ రైల్వే ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారతజట్టు 3-1గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో భారత్ ఆస్ట్రియా, స్లొవేనియా, చెక్ రిపబ్లిక్, జర్మనీపై గెలిచి టాప్‌లో నిలిచింది. పిసి విగేశఖ్, నితిన్ కుమార్ సిన్హా, పృథ్వీ శేఖర్, పి సిద్ధార్థ్‌లతో కూడిన భారతజట్టుకు శివకుమార్ రెడ్డి కోచ్‌గా ఉన్నారు. అలాగే అనుజ్ కుమార్ తయాల్, పవన్ కుమార్ అధికార ప్రతినిధులు. కెప్టెన్ పివి విఘ్నేశ్ మాట్లాడుతూ మరోసారి స్వర్ణం గెలిచినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. 2007నుంచి ప్రపంచ రైల్వే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నామని, ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించగా.. అందులో నాలుగుసార్లు ఛాంపియన్‌గా, 2011లో రజత పతకం సాధించినట్లు వెల్లడించాడు.










