Oct 03,2023 21:25
  • లౌల్లీనాకు ఒలింపిక్‌ బెర్త్‌
  • భారత్‌ ఖాతాలో మరో తొమ్మిది పతకాలు

హాంగ్జౌ: 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన 5వేల మీ. పరుగులో పారుల్‌ చౌదరి, జావెలిన్‌ త్రోలో అన్నురాణి స్వర్ణ పతకాలను సాధించారు. ముఖ్యంగా 5వేల మీ. పరుగులో పారుల్‌ చౌదరి నయా చరిత్ర లిఖించింది. ఈ పరుగును 15నిమిషాల 14.75 సెకన్లలో పూర్తి చేసిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుపుటల్లోకెక్కింది. ఇక హిరోనికా రిరికా(జపాన్‌) 15 నిమిషాల 15.34సెకన్లు, కిప్కిరురు కరోలిన్‌ చెప్‌కోయిచ్‌(కజకిస్తాన్‌) 15నిమిషాల 23.12 సెకన్లలో రజత, కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. పారుల్‌ చౌదరికి ఆసియా క్రీడల్లో ఇది రెండో పతకం. సోమవారం జరిగిన 3వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో పారుల్‌ చౌదరి రజత పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్లో అన్నురాణి బంగారు పతకాన్ని ముద్దాడింది. అన్ను రాణి 4వ ప్రయత్నంలో జావెలిన్‌ను 62.93మీ. విసిరి ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో నదీషా దిల్హాన్‌(శ్రీలంక) రజత పతకం కైవసం చేసుకుంది.
పురుషుల 92కిలోలకు పైబడిన విభాగంలో నరేంద్ర కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో నరేంద్ర ఐదురౌండ్ల ఉత్కంఠ పోటీలో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, కజకిస్తాన్‌కు చెందిన కంషేబేక్‌ చేతిలో 0-5పాయింట్లతో ఓటమిపాలయ్యాడు.

తేజశ్విని శంకర్‌కు రజతం..

డెకథ్లాన్‌లో తేజశ్విని శంకర్‌ జాతీయ రికార్డును నెలకొల్పి రజత పతకం సాధించాడు. పురుషుల డెకథ్లాన్‌ ఫైనల్లో తేజశ్విని1500మీ. పరుగులో నాల్గో స్థానంతో మొత్తం 7,666పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో భారత్‌కు పతకం దక్కడం 1974తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో విజరు సింగ్‌ చౌహాన్‌ 7,659పాయింట్లతో జాతీయ రికార్డును నెలకొల్పాడు.
800మీ. పరుగులు మహ్మద్‌ అఫ్సల్‌ కాంస్య పతకం సాధించాడు. ఈ పరుగులును ఒక నిమిషం 48.43సెకన్లతో రెండోస్థానంలో నిలిచాడు. సౌదీ అరేబియాకు చెందిన ఎస్సా అలీకి స్వర్ణ పతకం దక్కింది. భారత్‌కే చెందిన కిషన్‌ కుమార్‌ ఐదోస్థానంలో నిలిచాడు.
ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌ కాంస్య పతకం సాధించాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో భాగంగా తొలి ప్రయత్నంలో 16.68మీటర్లు జంప్‌ చేసి మూడోస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన అబుబకర్‌ 16.62మీ. నాల్గోస్థానానికే పరిమితమయ్యాడు.

ఫైనల్‌లో లవ్లీనా

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇవాళ ఇప్పటి వరకు రెండు పతకాలే వచ్చి చేరాయి. అయితే, మరిన్ని పతకాలు వచ్చే అవకాశాలను మాత్రం అథ్లెట్లు సష్టించారు. కనోయింగ్‌ ఈవెంట్‌లో భారత ద్వయం అర్జున్‌ సింగ్‌, సునీల్‌ సింగ్‌ మూడోస్థానలో నిలిచారు. కనోయింగ్‌ డబుల్స్‌లో 1000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. మరోవైపు 54 కేజీల బాక్సింగ్‌ విభాగంలో ప్రీతి కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో భారత పతకాల సంఖ్య 62కి చేరింది. ఇందులో 13 స్వర్ణాలు, 24 రజతాలు, 25 కాంస్య పతకాలు ఉన్నాయి.

w

లౌల్లీనాకు ఒలింపిక్స్‌ బెర్త్‌..

బాక్సింగ్‌లో మహిళల 75 కేజీల విభాగంలో ఫైనల్లోకి చేరి లౌల్లీనా బోర్గోహైన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో గెలిచి ఫైనల్‌కు చేరడంతోపాటు పతకం ఖాయం చేసుకుంది. అలాగే వ్యక్తిగత ఆర్చరీ విభాగంలోనూ జ్యోతి సురేఖ వెన్నం కూడా ఫైనల్‌లో అడుగుపెట్టింది. భారత ఆర్చరీ అభిషేక్‌ వర్మ, ఓజాస్‌తో కూడిన పురుషుల జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఫైనల్స్‌ అక్టోబర్‌ 7న జరగనుంది. ఇక బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లోనూ అశ్విని పొన్నప్ప-తనీషా కాస్ట్రో రెండో రౌండ్‌లోకి చేరారు. కబడ్డీ మహిళల జట్టు, దక్షిణ కొరియాపై 56-23 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మంగళవారం పోటీలు ముగిసే సరికి భారత్‌ 69 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

సెమీస్‌కు టీమిండియా.. నేపాల్‌పై .. పరుగుల తేడాతో గెలుపు

పురుషుల క్రికెట్‌లో భారతజట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం నేపాల్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా 23పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. యశస్వి(100) సెంచరీ సాధించాడు. ఛేదనలో నేపాల్‌ కూడా దూకుడుగానే ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది.

శతకం బాదేసిన యశస్వి

భారత ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (25), యశస్వి జైస్వాల్‌ అదరగొట్టారు. తొలి వికెట్‌కు శతక(103) భాగస్వామ్యం నిర్మించారు. యశస్వివే అత్యధికం కావడం విశేషం. కానీ, నేపాల్‌ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో పరుగుల వేగం మందగించింది. స్వల్ప వ్యవధిలో రుతురాజ్‌, తిలక్‌ (2), జితేశ్‌ శర్మ (5) వికెట్లు పడ్డాయి. మరోవైపు యశస్వి మాత్రం తన దూకుడు తగ్గించలేదు. క్రీజ్‌లో పాతుకుపోయి దూకుడుగా ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ వెంటనే పెవిలియన్‌కు చేరాడు. అయితే, చివర్లో శివమ్‌ దూబెతో (25లి)తో కలిసి రింకు సింగ్‌ (37లి) చెలరేగిపోయాడు. నాలుగు సిక్స్‌లు బాదేసి జట్టు స్కోరును 200 దాటించాడు. నేపాల్‌ బౌలర్లు దీపేంద్ర 2.. సోంపాల్‌, లామిచానె చెరొక వికెట్‌ తీశారు.