Sep 08,2023 22:01

యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి అమెరికా సంచలనం, 6వ సీడ్‌ కోకా గాఫ్‌, రష్యాకు చెందిన 2వ సీడ్‌ ఆర్యానా సబలెంకా ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో 18ఏళ్ల గాఫ్‌ 6-4, 7-5తో 10వ సీడ్‌ కరోలినా ముఛోవా(చెక్‌ రిపబ్లిక్‌)పై సునాయాసంగా గెలుపొందిది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో యువ క్రీడాకారిణికి 27ఏళ్ల ముఛోవా నిలువరించలేకపోయింది. తొలుత ఒక బ్రేక్‌ పాయింట్‌ సాధించి ఆ సెట్‌ను చేజిక్కించు 6-4తో చేజిక్కించుకున్న గాఫ్‌.. రెండో సెట్‌ 5-5తో సమంగా ఉన్న దశలో టైబ్రేక్‌కు వెళ్తుందనుకున్న దశలో ముఛోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది. టోర్నీ ప్రారంభం నుంచి కోకా గాఫ్‌ అద్భుత విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చింది.
రెండో సెమీస్‌లో 2వ సీడ్‌ సబలెంకా అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో సబలెంకా తొలి సెట్‌ను ఒక్క పాయింట్‌ కూడా చేజిక్కించుకోకుండా 0ా6తో ప్రత్యర్ధికి సమర్పించుకొంది. దీంతో ఈ మ్యాచ్‌ 17వ కీస్‌ సునాయాసంగానే నెగ్గుతుందనుకున్న దశలో రెండు మూడు సెట్‌లను టై బ్రేక్‌లో చేజిక్కించుకొని ఫైనల్లోకి దూసుకొచ్చింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో సబలెంకా 0-6, 7-6(7-1), 7-6(10-5)తో అమెరికాకు చెందిన కీస్‌ను చిత్తుచేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గిన సబలెంకా ఫ్రెంచ్‌, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెమీస్‌కు చేరింది. యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లోనూ తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం గాఫ్‌ాసబలెంకాల మధ్య టైటిల్‌పోరు జరగనుంది.
రేపు పురుషుల సింగిల్స్‌ సెమీస్‌..
మెద్వదెవ్‌ × అల్కరాజ్‌
జకోవిచ్‌ × షెల్టన్‌