భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం 49 అడుగులు ఉన్న నీటిమట్టం సోమవారం ఉదయం 6 గంటలకు 47.6 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఉదయం 8 గంటలకు 45.6 అడుగులకు చేరింది. గంట గంటకూ నీటిమట్టం తగ్గుతోంది. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారులపై వరద తగ్గిపోవడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. వరద తగ్గినప్పటికీ బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు.










