ప్రజాశక్తి-ఎటపాక : గోదావరి మహాగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటింది. ఎటపాక మండలం రాయన్న పేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిశా ఛత్తీస్‌గడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగులోనూ ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.54 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఇక్కడ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరదల నేపథ్యంలో పజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సూచించింది.










