Jun 07,2023 17:34

ప్రజాశక్తి-కాకినాడ : 38వ జాతీయ స్థాయి సీనియర్‌ తైక్వాండో పోటీలు ఈనెల 8 నుండి 11వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరుగుతున్నట్లు తైక్వాండో జిల్లా కార్యదర్శి బి. అర్జునరావు తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు మొత్తం ఆరుగురు క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులు బి. అఖిల, కె.వైష్ణవి, కె.దివ్య, పి.భార్గవి శ్రీకళ, జి.మేరీ గోల్డ్‌, బి.ఎల్‌.ఎస్‌.సౌమ్య, బి.తేజ, బి.అభిషేక్‌, ఎస్‌.ఎమ్‌.వివి.సాయి, టీంలీడర్‌ జి.లక్ష్మీనారాయణ పాల్గొంటారని తెలిపారు. వీరంతా గత ఫిబ్రవరిలో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారన్నారు. జట్టులోని క్రీడాకారులకు రాష్ట్ర కార్యదర్శి పి.అచ్యుతరెడ్డి, జిల్లా కార్యదర్శి కె.పద్మనాభం, తైక్వాండో జిల్లా అధ్యక్షులు మధుసూదనరావు, డిఎస్సే చీఫ్‌ కోచ్‌ శ్రీనివాస్‌ కుమార్‌, నేషనల్‌ రిఫరీలు సత్యనారాయణ, త్రిమూర్తులు, తదితరులు అభినందించారు.