Jan 24,2023 16:13

ప్రజాశక్తి-కోట(తిరుపతి) : బాలికలు అన్నీ రంగాల్లో ప్రధమ స్థానంలో నిలవాలనీ అంగన్వాడీ ప్రాజెక్టు సీడీపీఓ జ్యోతి అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కోట మండలంలోని స్థానిక కోట ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కోట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలు యొక్క విద్య, బాల్య వివాహాలు,సంరక్షణ, హక్కులు,ఆరోగ్యం,సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కలిగివుండాలని పిల్లలుకు తెలియజేశారు. ఈ సందర్భ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ లు కవిత,పద్మ,బుజ్జమ్మ, మహిళా పోలీసులు శశి, మంజుల,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • చెందోడు పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం

కోట మండలం చెందోడు పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఆధ్వర్యంలో బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని చెందోడు ఎమ్‌పియుపి పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులు పాల్గొని ఆడపిల్లలుకు పలు అంశాలుపై అవగాహన కల్పించారు. బాలికల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంకనూ హింసకు బలవుతున్నారని, చట్టాలను నిజాయితీగా అమలు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కోమది, రాజేశ్వరి, భారతి, రూప, విద్యార్థులు పాల్గొన్నారు.