Jan 31,2023 13:31

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : సమాజంలో బాలికలు స్వేచ్ఛగా ఉండాలి అని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అన్నారు. స్థానిక డిపిఎన్‌ బాలురు హైస్కూల్‌ నుండి స్వాబావన్‌ అవగాహన సదస్సు, ర్యాలీ మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ... 20 సంవత్సరాలవరకు బాల, బాలికలు తమ చదువు, సంస్కఅతి సంప్రదాయాలు పాటించాలని సూచించారు. పిల్లలు తమ అభిప్రాయం తల్లిదండ్రులతో పంచుకోవాలని అన్నారు. మెయిన్‌ రోడ్‌ వరుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షురాలు కలగా లక్ష్మి, మండల ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి సర్పంచ్‌ లు, మంత్రి జయరజనీ, విద్యార్థులు పాల్గొన్నారు.